ఆదివాసీ హక్కుల సాధనకై జన్నారంలో తుడుం దెబ్బ నూతన కమిటీ ఎన్నిక

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పెంద్రం హన్మంతు అధ్యక్షతన నూతన మండల కమిటీతో పాటు అనుబంధ విద్యార్థి సంఘం కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తుడుం దెబ్బ అధ్యక్షులుగా మర్సుకోల వసంత్, ప్రధాన కార్యదర్శిగా ఉర్వేత ధర్ము, విద్యార్థి సంఘం అధ్యక్షులుగా తుమ్రం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా ఆత్రం రాములను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం ఛలో ఐటీడీఏ ఉట్నూర్ కరపత్రాలను విడుదల చేసి భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.