రామోజీ ఫిల్మ్‌సిటీలో ఎన్ఎస్‌జీ ఆక్టోపస్ బలగాల ఉత్కంఠభరిత మాక్‌డ్రిల్
రిపోర్టర్: హరి
స్థలం: Telangana
రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఎన్ఎస్‌జీ మరియు ఆక్టోపస్ ప్రత్యేక బలగాలు శుక్రవారం ఉత్కంఠభరితమైన మాక్‌డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టడం, బంధీలను సురక్షితంగా రక్షించడం మరియు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానంపై ఈ విన్యాసాలు చేపట్టారు. భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులను మట్టుబెట్టడం, ర్యాప్లింగ్ మరియు అత్యాధునిక సాంకేతికతతో శత్రువులను ఏమార్చి ఆపరేషన్ విజయవంతం చేసిన తీరును బలగాలు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించాయి.