తోటపల్లిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగిన మైసమ్మ బోనాలు

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో కొలువైన గండికోట మైసమ్మకు గ్రామస్థులు శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు కొత్త కుండలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గుడి చుట్టూ రైతులు ట్రాక్టర్లు, బండ్లు తిప్పారు. ఈ కార్యక్రమంలో డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు విన్సాసాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.