'స్వామివారి వైభవాన్ని ప్రశ్నించిన వారు చరిత్ర హీనులే': సీఎం చంద్రబాబు హెచ్చరిక

రిపోర్టర్: అశోక్ స్థలం: Amaravati

శ్రీవేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని, విశిష్టతను ప్రశ్నించిన వారు ఎవరైనా కాలగర్భంలో కలిసిపోయి చరిత్ర హీనులుగా మిగిలిపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ఎప్పుడూ స్వామివారే చూసుకుంటారని, మనం చేయాల్సిందల్లా ఆయన ఆదేశాలను పాటించడమేనని స్పష్టం చేస్తూ తిరుమల పవిత్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు.