సొంత ఊరిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి సందడి.. ప్రత్యేక పూజలు
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: పొదలకూరు
పొదలకూరు మండలం తోడేరు పంచాయతీ శాంతి నగర్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. గంగ పోలేరమ్మ తల్లి పొంగళ్ల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, గ్రామస్తులతో మమేకమై పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ప్రజల ప్రేమాభిమానాలే తన నిజమైన ఆస్తి అని కాకాణి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని, జగనన్న ప్రభుత్వం రాగానే గ్రామంలోని అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు.