మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి దారుణం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Warangal

ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల సమస్యలు తెలుసుకునేందుకు శాంతియుతంగా వెళ్తున్న మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను అడ్డుకుని పోలీసులు దాడి చేయడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్ చేసింది. వినయ్ భాస్కర్‌పై దాడికి పాల్పడిన సంబంధిత పోలీసు అధికారులపై డీజీపీ వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు.