మహాత్మా గాంధీ జయంతి వేడుకలు: సత్యం అహింస సిద్ధాంతాలను ఆచరించాలని సైబరాబాద్ పోలీసుల పిలుపు
రిపోర్టర్: వెంకట్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సత్యం, అహింస మరియు స్వావలంబన సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. నైతిక పాలన, బాధ్యయుతమైన పౌరసత్వానికి గాంధేయ సిద్ధాంతాలు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. పరస్పర గౌరవం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆయన దార్శనిక విధానం అందరికీ ఆదర్శప్రాయమని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.