యుద్ధ భూమిలో పక్షుల గూళ్లు: ఫైబర్ కేబుల్స్ తో ఆశ్చర్యకర నిర్మాణం
రిపోర్టర్: రాము
స్థలం: Kharkiv
ఉక్రెయిన్ యుద్ధ భూమిలో పక్షులు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తో గూళ్లు నిర్మిస్తున్నాయని క్యూవ్ మ్యూజియం క్యూరేటర్ యానా హ్రింకో తెలిపారు. డ్రోన్ల వైర్లతో పక్షులు అల్లిన ఈ గూళ్లు యుద్ధ తీవ్రతకు పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని అద్దం పడుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఖార్కివ్ ప్రాంతంలో లభించిన ఈ విభిన్నమైన గూళ్లను చారిత్రక రికార్డుల కోసం మ్యూజియంలో భద్రపరిచారు.