ఇంజనీర్ల దినోత్సవ వేళ విశ్వేశ్వరయ్య విగ్రహ ఆవిష్కరణ
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు ఘనంగా ఆవిష్కరించారు. జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీరు బి.సత్యనారాయణ రెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీరు ఎస్.రాధారాణి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ రంగానికి విశ్వేశ్వరయ్య అందించిన అమూల్యమైన సేవలను వక్తలు కొనియాడారు.