కల్వకుర్తి పట్టణంలో ఏబీవీపీ నూతన నగర కమిటీ ఎన్నిక

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి పట్టణంలో జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో ఏబీవీపీ నూతన నగర కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శిగా వసంత చరణ్ యాదవ్, సంయుక్త కార్యదర్శిగా గంటి శివరాం, భరద్వాజ్ ఎన్నికయ్యారు. మిగతా కార్యకర్తలకు వివిధ బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ యాదవ్ తదితరులు పాల్గొని విద్యార్థి నాయకులను అభినందించారు.