మురుగు నీటితో దుర్వాసన వెదజల్లుతున్న జన్నారం ప్రధాన రహదారి

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు మురుగు నీరు నిలువకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకులు సాయికిరణ్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జన్నారంలో ప్రతి మంగళవారం వారసంత జరుగుతుందని, ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పక్కన నీరు నిలిచి దుర్వాసన వస్తుందన్నారు. దీంతో చిరు వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి తగిన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.