స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టుల సిబ్బంది క్రమబద్ధీకరణపై సుప్రీంకోర్టు కీలక సూచన
రిపోర్టర్: కిరణ్
స్థలం: దిల్లీ
రాష్ట్రంలోని స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందిని క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పదిహేనేళ్లుగా సేవలు అందిస్తున్న చిరుద్యోగుల పట్ల పక్షపాతం చూపకుండా, రెండు వారాల్లోపు తగిన నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.