గోదావరి డెల్టా ఆధునీకరణకు పకడ్బందీ కార్యాచరణ: మంత్రి నిమ్మల రామానాయుడు

రిపోర్టర్: హరి స్థలం: Amaravati

గోదావరి డెల్టా ప్రాంతంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఆధునీకరణ పనులకు కార్యాచరణ సిద్ధం చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలో అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. రూ.13 కోట్ల వ్యయంతో లైడార్ సర్వే పూర్తి చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. తూర్పు, సెంట్రల్ డెల్టాలకు ప్రత్యేక ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు.