'మాజీ సైనికుడిపై సాక్షి గూండాయిజం': పాత్రికేయ ముసుగులో అరాచకాలంటూ లీడర్ల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Andhra Pradesh
దేశ సరిహద్దుల్లో సేవలు అందించిన మాజీ సైనికుడు, ఉపాధ్యాయుడిపై 'సాక్షి' మీడియా గూండాయిజానికి పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీ ఎంపికలపై బురదజల్లేందుకే పాత్రికేయ ముసుగులో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని, ఉపాధ్యాయులను వేధిస్తున్న 'సాక్షి గ్యాంగ్' తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.