'రూ.5,912 కోట్లతో పట్టణ అభివృద్ధికి మోక్షం': ఏపీలో 14 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

అమరావతిలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ కింద రూ.5,912 కోట్లతో రెండో విడతలో చేపట్టనున్న 14 ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంచనా వ్యయంలో కేంద్రం 25% గ్రాంట్‌ అందించనుండగా, 50% నిధులు మున్సిపల్‌ బాండ్లు, పీపీపీ విధానంలో సేకరించి, మిగతా 25% నిధులను పట్టణ స్థానిక సంస్థలు సమకూర్చనున్నాయి.