తాడేపల్లి ప్యాలెస్ ముట్టడించిన నిరుద్యోగ పశువైద్యులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తాడేపల్లి
పశువైద్య నియామకాలపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ నిరుద్యోగ వైద్యులు తాడేపల్లిలోని జగన్ నివాసం ముందు నిరసన చేపట్టారు. జాబ్ క్యాలెండర్లోని పశువైద్య పోస్టులపై సాక్షి పత్రికలో వచ్చిన కథనాలను నిరసిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వంద మందికి పైగా వైద్యులు ఆందోళన నిర్వహించారు. నియామక ప్రక్రియను పారదర్శకంగా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పత్రిక ప్రతులను దహనం చేశారు.