బాహుదా నది ఉద్ధృతి: శ్రీకాకుళంలో జాతీయ రహదారిపై 36 గంటల ట్రాఫిక్ జాం
రిపోర్టర్: గోపి
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం లొద్దపుట్టి వద్ద బాహుదా నది వరద నీరు పదహారవ నంబరు జాతీయ రహదారిపైకి భారీగా చేరడంతో ముప్పై ఆరు గంటలపాటు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అడుగున్నర లోతులో వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్నప్పటికీ పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, ఆదివారం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని వారు వెల్లడించారు.