మత సామరస్యాన్ని దెబ్బతీసే శక్తులను అడ్డుకోవాలన్న మొహమ్మద్ సలాం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కొణిజర్ల
కొణిజర్లలో తంజీమ్-ఎ-ఇన్సాఫ్ మహాసభ జరిగింది. రాష్ట్ర ప్రచార కార్యదర్శి మొహమ్మద్ సలాం మాట్లాడుతూ మతాల పేరుతో ప్రజలను విడదీస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత సామరస్యాన్ని, ప్రజల ఐక్యతను కాపాడాలన్నారు. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఖండించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దొండపాటి రమేష్ కోరారు. అనంతరం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.