అమెరికాలో విద్యార్థులకు తానా ఆధ్వర్యంలో బ్యాక్ ప్యాక్స్ పంపిణీ

రిపోర్టర్: మహేష్ స్థలం: USA

అమెరికాలోని మిన్నియాపోలిస్ బెతూన్ ఎలిమెంటరీ స్కూల్‌లో తానా నార్త్ సెంట్రల్ టీం ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులకు బ్యాక్ ప్యాక్స్ అందజేశారు. 'గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ' నినాదంతో తానా ఏభై ఏళ్ల వేడుకల్లో భాగంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. స్థానిక తానా ప్రతినిధులు రామ్ వంకిన, జయరాం నల్లమోతు తదితరులు పాల్గొని విద్యార్థులకు వీటిని పంపిణీ చేశారు. తానా సేవా దృక్పథాన్ని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.