బడంగ్‌పేట్‌లో సీజ్ చేసిన అక్రమ నిర్మాణ నోటీసు బ్యానర్ మాయం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: బడంగ్‌పేట్
రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ సర్వే నంబర్ 2లో అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. అయితే అధికారులు ఏర్పాటు చేసిన సీజ్ నోటీసు బ్యానర్ కొన్ని గంటల్లోనే తొలగిపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.