ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయం అందించేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వర్షాలు, ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నా, ఇతర సమస్యలు తలెత్తినా ప్రజలు 1912 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, పోలీస్ సహాయం కోసం 100, అంబులెన్స్ కోసం 108 నంబర్లను కూడా సంప్రదించవచ్చని తెలిపారు.