పోలవరం ప్రధాన డ్యాం ప్రాంతంలో మరో ఏడు పనులకు ఏర్పాట్లు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు వేగంగా సాగుతుండగా, వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రధాన డ్యాం ప్రాంతంలో మరో ఏడు కీలక మౌలిక సదుపాయాల పనులను డ్యాం నిర్మాణంతో పాటే పూర్తి చేసేందుకు అమరావతి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.