విశాఖ డేటా సెంటర్ పిటిషన్: హైకోర్టు విచారణ నేటికి వాయిదా

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపినట్లు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయని కోర్టుకు నివేదించారు. పిటిషనర్ రిప్లై కౌంటర్ రికార్డులోకి చేరకపోవడంతో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రకటించింది.