చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు లేవని స్పష్టం చేసిన పల్నాడు పోలీస్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: పల్నాడు
పల్నాడు జిల్లా పోలీస్ అధికారిక ఖాతా ద్వారా స్పందిస్తూ, ఈ నెల ఇరవై ఏడో తేదీన విజయవాడలో సచివాలయ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఎటువంటి ముందస్తు అనుమతులు మంజూరు కాలేదని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలు మరియు సర్వీస్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఉద్యోగులందరూ తమ విధులకు యథావిధిగా హాజరై ప్రజా శాంతికి సహకరించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.