గర్భాంలో పింఛన్లను స్వయంగా పంపిణీ చేసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం ఆయన స్వయంగా పర్యటించి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.