క్షయ వ్యాధి చికిత్సలోనూ భారీగా పెరుగుతున్న వైద్య ఖర్చులు: డాక్టర్ సౌమ్య స్వామినాథన్
రిపోర్టర్: గోపి
స్థలం: Andhra Pradesh / Telangana
ఉచిత పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ క్షయ వ్యాధి బాధితులు భారీగా వైద్య ఖర్చులు భరిస్తున్నారని, ఇది అనేక కుటుంబాలను తీవ్ర పేదరికంలోకి నెడుతోందని మాజీ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆవేదన వ్యక్తం చేశారు. క్షయ మరణాలతో పాటు ఈ వ్యక్తిగత వైద్య ఖర్చులను తగ్గించడం ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు అత్యంత కీలక ప్రాధాన్యతగా మారిందని ఆమె పేర్కొంటూ తక్షణమే ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.