మహానంది క్షేత్రంలో హుండీల లెక్కింపు: నూటయాభై ఆరు రోజులకు ముప్ పై రెండు లక్షలు

రిపోర్టర్: సురేష్ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో నిర్వహించిన హుండీల లెక్కింపులో నూటయాభై ఆరు రోజులకు సంబంధించి మొత్తం ముప్ పై రెండు లక్షల పదహారు వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో నల్ల కాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేవస్థానం అభిషేక మండపంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అమెరికా మరియు శ్రీలంక దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభించిందని ఆయన వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.