హైదరాబాద్ లో నేపాలీ ముఠా దందా గుట్టురట్టు: రెండు వేలకే నకిలీ ఆధార్ కార్డు

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

రాజధానిలో విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయని సీపీ సజ్జనర్ తెలిపారు. నేపాల్ నుంచి వలస వచ్చి రూ. రెండు వేలు చెల్లించి దళారుల ద్వారా నకిలీ పేర్లతో ఆధార్ కార్డులు పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇళ్లలో పని మనుషులుగా చేరుతూ మత్తుమందు ఇచ్చి చోరీలకు పాల్పడుతున్న ఈ అంతర్రాష్ట్ర ముఠా వలలను ఛేదించినట్లు ఆయన స్పష్టం చేశారు.