కార్మిక గర్జన సభ జయప్రదంపై గోదావరిఖనిలో నేతల కీలక సమావేశం

రిపోర్టర్: సురేష్ స్థలం: మంచిర్యాల

ఈ నెల పద్నాలుగో తేదీన గోదావరిఖనిలో నిర్వహించనున్న కార్మిక గర్జన బహిరంగ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించినట్లు బాల్క సుమన్ - మాజీ ఎమ్మెల్యే చెన్నూర్ వెల్లడించారు. సభ ఏర్పాట్లు, కార్మికుల సమీకరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి దిశానిర్దేశం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.