మోదీ పాలనలో ఎమర్జెన్సీ రోజులు: సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో మోదీ పాలన నాటి ఎమర్జెన్సీ చీకటి రోజులను తలపిస్తోందని సీజేపీ నేత సౌరబ్ మండిపడ్డారు. ఢిల్లీలో విమానం దిగకుండానే తమను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ కాలంలో కూడా రైళ్లను నిలిపివేయలేదని, కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ఆ పని చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని సౌరబ్ ధ్వజమెత్తారు. దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ లేకున్నా, ఆచరణలో మాత్రం నిరంకుశ పాలన సాగుతోందని సీజేపీ నాయకులు ఆరోపించారు.