అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మండల ప్రత్యేక అధికారి పిలుపు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం సర్పంచులు, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి బి. దేవ్‌సింగ్, ఎంపీడీవో నాగవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులపై చర్చించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగితేనే గ్రామాలు అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి స్పష్టం చేశారు.