అధికారి రాజకీయ పోస్టుల వివాదంపై రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట సమావేశంలో హౌసింగ్ ఏఈ వివేక్ అధికారిక వాట్సాప్ గ్రూపులో మాజీ సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ పోస్టులు పెట్టడం సరికాదని, వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నిరసనగా నేడు ఎంపీడీవో కార్యాలయం ముందు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.