అమ్రాబాద్లో దారుణం.. తండ్రిని చంపి సంచిలో మూటగట్టిన తనయులు!

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అచ్చంపేట

అమ్రాబాద్ మండల కేంద్రంలో బురాన్ అనే వ్యక్తిని అతని భార్య, ఇద్దరు కుమారులు కలిసి దారుణంగా హత్య చేశారు. మూడు రోజుల క్రితమే ఇంటిలో చంపి, మృతదేహాన్ని సంచిలో మూటగట్టి ఇనుప పెట్టెలో దాచిపెట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

దుర్వాసన రాకుండా నిందితులు మృతదేహం చుట్టూ పౌడర్ చల్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉండగా, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.