బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ముప్పు: తుఫాను హెచ్చరికలపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష
రిపోర్టర్: శివ
స్థలం: Andhra Pradesh
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉన్నందున రాష్ట్రంపై పడే ప్రభావం మరియు ముందస్తు సన్నద్ధతపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించినట్లు ఏపీ సీఎం కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ తుఫాను కోనసీమ, యానాం మరియు కాకినాడ ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.