వైద్య సీట్ల కేటాయింపు నిబంధనలపై ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి డిమాండ్

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

వైద్య విద్య ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన రాష్ట్రస్థాయి మెడికో పేరెంట్స్ మీట్లో ఆయన మాట్లాడుతూ, జీవో నంబర్ 150 కారణంగా స్థానిక విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు రాష్ట్రంలో చదివిన వారికే స్థానికత ఆధారంగా సీట్లు కేటాయించేలా నిబంధనలు రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు.