బెంగళూరులో షాకింగ్ ఘటన: మహిళ చేతులు అతికించి బంగారు గొలుసు అపహరణ
రిపోర్టర్: సతీష్
స్థలం: Bengaluru
బెంగళూరు ఇందిరానగర్ లోని ఒక దుకాణంలో ప్ర ప్రభురాజ్ అనే వ్యక్తి సంచలనం సృష్టించాడని డిసిపి విక్రమ్ అమాతే తెలిపారు. మహిళా ఉద్యోగి జయశ్రీ చేతులకు ఫెవిక్విక్ పూసి డెస్క్ కు అతికించి, కత్తితో బెదిరించి నాలుగున్నర లక్షల విలువైన బంగారు మంగళసూత్రం ఎత్తుకెళ్లాడని ఆయన వెల్లడించారు. స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు వెంబడించి నిందితుడిని పట్టుకున్నారని, మహిళ సురక్షితంగా బయటపడిందని అధికారులు స్పష్టం చేశారు.