పశుసంవర్ధక సహాయకులకు వెంటనే ప్రొబేషన్ ప్రకటించాలని కలెక్టర్లకు వినతి

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

స్వర్ణ గ్రామ సచివాలయాల్లో 2023 నోటిఫికేషన్‌ ద్వారా నియమితులైన 1,896 మంది పశుసంవర్ధక సహాయకులకు వెంటనే ప్రొబేషన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్‌లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. గత ఫిబ్రవరిలోనే ప్రొబేషన్‌ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నకిలీ ధ్రువీకరణ పత్రాల ఆరోపణల పేరుతో అందరికీ పెండింగ్‌లో పెట్టడం సరికాదని ఏహెచ్‌ఏల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. నకిలీలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సబ్జెక్ట్‌ టు కండీషన్‌ ప్రాతిపదికన ప్రొబేషన్‌ ప్రకటించాలని కోరారు.