రష్యా ఆయిల్ కొనుగోళ్లపై వంద శాతం సుంకం విధించే చట్టంపై డోనాల్డ్ ట్రంప్ సంతకం
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా మరియు ఇరాన్ ఆంక్షల చట్టంపై అధికారికంగా సంతకం చేశారు. రష్యా నుంచి అత్యధికంగా చమురు మరియు గ్యాస్ దిగుమతి చేసుకునే మొదటి ఐదు దేశాలపై వంద శాతం వరకు సుంకాలు విధించే విస్తృత అధికారాలను ఈ చట్టం అధ్యక్షుడికి కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ జాబితాలో భారత్ కూడా ఉండటం గమనార్హం. ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపివేయాలని రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.