విశాఖలో భారీ గోల్డ్ సీజ్: ఎనిమిది కోట్ల విలువైన విదేశీ బంగారం స్వాధీనం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీ మొత్తంలో విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కోల్కతా నుంచి హైదరాబాద్కు కారులో అక్రమంగా తరలిస్తున్న ఐదు కోట్ల ఎనుబది మూడు లక్షల విలువైన ఐదు కిలోల ఎనిమిది వందల ముప్పై గ్రాముల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు. వాహనం అడుగుభాగంలో ప్రత్యేకంగా దాచిన ఈ సొమ్ము బంగ్లాదేశ్ నుంచి రవాణా అయినట్లు అనుమానిస్తున్నారు.