భారత సైన్యం ఆధ్వర్యంలో అల్ట్రా లైట్ హోవిట్జర్ కాల్పుల విన్యాసాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: భారతదేశం
భారత సైన్యం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎం777 అల్ట్రా లైట్ హోవిట్జర్ ఫిరంగి లైవ్ ఫైరింగ్ విన్యాసాలు విజయవంతమయ్యాయి. డైరెక్ట్ ఫైరింగ్ పద్ధతిని ఉపయోగించి లక్ష్యాలను ఛేదించారు. ఈ విన్యాసాల్లో సైనిక సిబ్బంది అసాధారణ వృత్తి నైపుణ్యం, కచ్చితత్వాన్ని ప్రదర్శించారు. నిర్ణీత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించి ధ్వంసం చేశామని రక్షణ వర్గాలు వెల్లడించాయి.