అట్టహాసంగా సైమా అవార్డుల వేడుక, ఉత్తమ నటుడిగా తేజ సజ్జ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కర్ణాటక

బెంగళూరు వేదికగా జరుగుతున్న సైమా 2026 అవార్డుల వేడుకలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన విజేతల వివరాలను ప్రకటించారు. 'మిరాయ్‌' చిత్రంలోని నటనకు గానూ తేజ సజ్జా ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. అలాగే 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి ఐశ్వర్య రాజేశ్‌ ఉత్తమ నటిగా, రేవంత్ ఉత్తమ హాస్యనటుడిగా అవార్డులు గెలుచుకున్నారు. పలు విభాగాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో అవార్డులు అందుకున్నారు.