స్థానిక ఎన్నికల వేళ హింసకు పాల్పడితే ఉక్కుపాదం: డీజీపీ హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడినా, ఓటర్లను బెదిరించినా ఎంతటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు. ఎనిమిది జిల్లాల్లో పద్నాలుగు అవాంఛనీయ ఘటనలు నమోదయ్యాయని, పదిహే మంది నిందితులను గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశామని డీజీపీ వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.