షార్జాలో కర్ణాటక వాసి దారుణ హత్య మృతదేహం తొమ్మిది ముక్కలుగా నరికివేత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Karnataka
యూఏఈలోని షార్జాలో కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా ఉదయవార్కు చెందిన అల్విన్ ప్రకాష్ కుందర్ దారుణ హత్యకు గురయ్యారు. గత జూలైలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి రాగా ఆయన మృతదేహం ఇంట్లోనే తొమ్మిది ముక్కలుగా నరికి రెండు బ్యాగుల్లో లభ్యమైంది. మృతుడి భార్య టీనీ కుందర్, కొడుకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో భార్యే హత్య చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.