వైద్యం అందక వీల్‌చైర్‌లో తల్లిని ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లిన కుమారుడు
రిపోర్టర్: అశోక్
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందకపోవడంతో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన తల్లిని భూక్యా బుజ్జిని కుమారుడు భూక్యా రాజ్‌కుమార్ వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి రెండు కిలోమీటర్లు తోసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు నివాసానికి తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. అర్ధరాత్రి ఆస్పత్రిలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు బెడ్ ఇవ్వలేదని, తనపై దాడి చేశారని రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి ఆర్ఎంవో శ్రీధర్ అక్కడికి చేరుకుని బాధితులకు హామీ ఇచ్చి తిరిగి ఆస్పత్రికి తరలించారు.