బెంగళూరులో కలకలం రేపుతున్న రూ.5 కోట్ల నకిలీ మందుల గుట్టు రట్టు
రిపోర్టర్: రాము
స్థలం: కర్ణాటక
బెంగళూరులో నకిలీ మందుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. క్యాన్సర్ చికిత్స మందులు, అత్యవసర ఇంజెక్షన్లను 90కి పైగా ఆసుపత్రులకు సరఫరా చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. మార్కెట్ ధర కంటే 50 శాతం తక్కువకే వీటిని విక్రయించారు. రూ. 5 కోట్ల విలువైన ఈ నకిలీ ఔషధాల నెట్‌వర్క్ మహారాష్ట్ర, గుజరాత్‌కూ పాకినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు తీవ్రతరం చేశారు.