ఆంధ్ర మహిళల ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్ ఘన విజయం

రిపోర్టర్: నరేష్ స్థలం: మంగళగిరి

మంగళగిరి వేదికగా రాయలసీమ జెన్ స్టార్స్తో జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ లక్ష్మి అర్ధశతకంతో రాణించగా, కెప్టెన్ నీరగట్టు అనూష, కాట్రగడ్డ దీక్ష రాణించారు. రాయలసీమ బౌలర్లలో పూజిత, అనుష చెరో వికెట్ దక్కించుకున్నారు.