రైతు సమస్యలను పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ సర్కార్: ఎంపీ గోడం నగేశ్ మండిపాటు

రిపోర్టర్: రమేష్ స్థలం: ఆదిలాబాద్

రైతు సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేశ్ ధ్వజమెత్తారు. తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చి అన్నదాతలను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ, నేడు వారి సమస్యలను పూర్తిగా గాలికొదిలేసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ త్వరలోనే అన్నదాతల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.