పిల్లలవలసలో ప్రశాంతంగా ముగిసిన ఎస్ఎంసీ చైర్మన్ ఎన్నిక
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పొందూరు
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పిల్లలవలస ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. చైర్మన్గా గురుగుబెల్లి నరసింహ మూర్తి, వైస్ చైర్మన్గా గురుగుబెల్లి రాజ్యలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బుడుమూరు పోలినాయుడు, ప్రధానోపాధ్యాయులు బస్వా గొల్లవాడు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.