అండర్-19 ఆసియా కప్: భారత జట్టు ప్రకటన, వీరేందర్ సెహ్వాగ్ కుమారుడికి చోటు
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
త్వరలో జరగనున్న అండర్-19 ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారని బీసీసీఐ వెల్లడించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన లక్ష్య రాయ్‌చందానీ ఈ జట్టుకు సారథ్యం వహించనుండగా, యశ్వర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ జట్టులో మాజీ క్రికెటర్ల కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ లకు చోటు దక్కింది. నవంబర్ 5 నుండి మస్కట్ వేదికగా జరిగే ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది.