టీచర్‌పై ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తనపై నిలదీస్తే కత్తితో దాడి
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ సూరారంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న మహిళా టీచర్ పట్ల ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించినట్లు పోలీసులు తెలిపారు. మానసిక వేధింపులతో ఆమె స్కూల్‌కు వెళ్లడం మానేయగా, కుటుంబసభ్యులు నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి బంధువులు, కాలనీవాసులు స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపల్‌ను నిలదీయగా ఆయన కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.